Site icon HashtagU Telugu

PayTM: డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం ఫౌండ‌ర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

Paytm

Paytm

ఢిల్లీలో డీసీపీ కారును ఢీకొట్టిన కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు చేశారు. విజయ్ శేఖర్ శర్మను ఫిబ్రవరి 22న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య్ త‌న వాహనాన్ని అరబిందో మార్గ్‌లో దక్షి ణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కారుని ఢీకొట్ట‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. విజయ్ శేఖర్ శర్మ తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారును వేగంగా నడుపుతూ ఢిల్లీలోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వెలుపల డీసీపీ బెనిటా మేరీ జైకర్ వాహనాన్ని ఢీకొట్టాడు.

డీసీపీ డ్రైవర్ దీపక్ కారులో పెట్రోలు నింపేందుకు వెళ్తున్నాడు. కారును ఢీకొట్టిన తర్వాత విజయ్ శేఖర్ శర్మ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అయితే డ్రైవ‌ర్ దీపక్ కారు నంబర్‌ను నోట్ చేసుకుని, ప్రమాదాన్ని డీసీపీకి నివేదించాడు. తదనుగుణంగా, మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత కారు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ కంపెనీకి చెందినదని గుర్తించారు. దక్షిణ ఢిల్లీలో నివసించే విజయ్ శేఖర్ శర్మ కారుగా పోలీసులు గుర్తించి.. అనంతరం పోలీసు స్టేషన్‌కు పిలిపించి అరెస్టు చేశారు. బెయిలబుల్ సెక్షన్ కిందకు రావడంతో అతనికి బెయిల్ మంజూరైంది.