Site icon HashtagU Telugu

Photo Shoot : అందాల ఆరబోతకు బోర్డర్‌ దాటేసి బ్యూటీ

Payal

Payal

Photo Shoot : తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ కొత్త చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. విశాలమైన గాజు కిటికీ పక్కన కూర్చుని, సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ ఆమె ప్రశాంతంగా కనిపించారు. సౌకర్యవంతమైన దుస్తులలో, ఆ ఇండోర్ సెట్టింగ్‌లో ఆమె ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించింది. “వాతావరణం బాగున్నప్పుడు, కొన్ని ఫోటోలు తీయడానికి మనకు మనం ప్రేరణ ఇచ్చుకుంటాం కదా!” అని ఆమె ఆ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చింది.

Tirumala: తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎలా ఉందంటే? ద‌ర్శ‌నానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందంటే?

అయితే, ఈ ప్రశాంతమైన క్షణాల వెనుక పాయల్ వ్యక్తిగతంగా ఎంతో భావోద్వేగమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఆమె తండ్రికి అన్నవాహిక క్యాన్సర్ (esophageal carcinoma) ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ప్రస్తుతం హైదరాబాద్‌లో కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని పాయల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, తన బాధను పంచుకున్నారు. “ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం, క్యాన్సర్‌తో ఈ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఆశీర్వాదం మాకు ఎంతో ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు.

“మా నాన్నగారికి మొదటి కీమోథెరపీ సెషన్ పూర్తయింది. పోరాడగలమని డాక్టర్లు చెప్పారు. మా నాన్న ధైర్యంగా, మొండిగా ఉన్నారు, కానీ చికిత్స దుష్ప్రభావాలను ఎదుర్కోవడం కష్టంగా ఉంది. నేను షూటింగ్ లొకేషన్లలో ఉన్నా కూడా, నాన్న ఆరోగ్యం గురించే మనసులో ఉంటుంది… ప్రస్తుతం ఆయనను బాగా చూసుకోవడమే నా లక్ష్యం” అని పాయల్ తన ఆవేదనను తెలియజేశారు.

Tragedy: ఢిల్లీని కుదిపేసిన దారుణం.. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక సూట్‌కేసులో శవమై