Site icon HashtagU Telugu

Pawan: కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం

Pawan

Pawan

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. యాత్రలో భాగంగా దెందులూరు నియోజకవర్గం జానంపేట గ్రామంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తొలి చెక్కు అందచేశారు. కౌలు రైతు నెరుసు మల్లికార్జునరావు సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. సాగు నష్టాలు, చేసిన అప్పులు తీర్చలేక నెరుసు మల్లికార్జున రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య శ్రీమతి శివదుర్గను ఓదార్చిన పవన్ కళ్యాణ్ … పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ఈ సాయంతోపాటు ఇద్దరు ఆడ బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పార్టీ నాయకులు ఘంటసాల వెంకట లక్ష్మీ, బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు.