పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా… ‘RRR’, ‘రాధేశ్యామ్’ సినిమాల కోసం వాయిదా పడాల్సి వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కరోనా పరిస్థితులు కూడా ఇంకో కారణంగా చెప్పవచ్చు. అయితే ఎట్టకేలకు ‘భీమ్లా నాయక్’ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఫిబ్రవరి 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. హిందీలో కూడా అదే రోజు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Bheemla Nayak: పవన్ ‘భీమ్లా నాయక్’ విడుదలకు డేట్ ఫిక్స్..!

bheemla nayak