Pawan Kalyan : ఛాంబర్ ను కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్

త్యాగానికి మారుపేరు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికే అనిపించుకున్న ఈయన..ఇప్పుడు టీడీపీ మంత్రి కోసం తనకోసం కేటాయించిన ఛాంబర్ ను కూడా వదులుకున్నారు

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 02:53 PM IST

జనసేన అధినేత , ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. త్యాగానికి మారుపేరు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికే అనిపించుకున్న ఈయన..ఇప్పుడు టీడీపీ మంత్రి కోసం తనకోసం కేటాయించిన ఛాంబర్ ను కూడా వదులుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాల ఏళ్లు గడుస్తున్నప్పటికీ..మొదటిసారి ఇప్పుడు అసెంబ్లీ లోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుండి బరిలో నిల్చుని భారీ విజయం సాధించారు. కేవలం ఆయనే కాదు జనసేన నుండి అసెంబ్లీకి పోటీ చేసిన 21 మంది , అలాగే పార్లమెంట్ కు పోటీ చేసిన ఇద్దరు కూడా విజయం సాధించి సత్తా చాటారు. ఇక ఏపీలో కూటమి విజయం కీలక పాత్ర పోషించినందుకు గాను సీఎం చంద్రబాబు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక శాఖలకు అప్పగించారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కల్యాణ్ బుధవారం గ్రామీణ, పంచాయతీ, అటవీ, సైన్స్ టెక్నలజీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే పవన్ కల్యాణ్ సచివాలయానికి తన ఛాంబర్‌ వివరాలు తెలుసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కు కేటాయించిన ఛాంబర్ ను మార్చేశారు. తొలుత సచివాలయంలోని 212, 214 రూమ్లలను కేటాయించగా ఆ గదులు తనకు కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ అడిగినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ కోసం 211 రూమ్ ను సిద్ధం చేశారు. ఇదిలా ఉంటె డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నేడు(మంగళవారం) క్యాంప్ ఆఫీస్ పరిశీలన కోసం విజయవాడ సూర్యారావుపేటలోని నీటి పారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా వందనం సమర్పించారు. రేపు సచివాలయంలో మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించడం పై అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. అలాగే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.

Read Also : NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు