Power Talk: పవన్ ‘వెలుగులు’ నింపేనా!

ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత విద్యుత్  కోతలతో జనం అల్లాడున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pawan

Pawan

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్  కోతలతో జనం అల్లాడున్నారు. మాడు పగిలే ఎండలతో.. బయటకు వెళ్లలేక.. వేసవి తాపంతో ఇంట్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో విద్యుత్ కోతలు లేకపోవడంతో.. ఇన్వర్టర్ లు, జనరేటర్లను పెద్దగా నమ్ముకోలేదు. కానీ ఇప్పుడు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపేస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు విద్యుత్ ఎందుకు పోతోందో..? ఎప్పుడు పోతోంది..ఎప్పుడు వస్తోంది అన్నదానిపై క్లారిటీ ఉండడం లేదు.

సామాన్యులు, పేదలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు సైతం పవర్ కట్స్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అయితే ఆ సమయంలో కరెంటు పోయింది. అప్పుడు ఈ ఫోన్ల లైట్ల వెలుగులో పవన్ మాట్లాడారు. పక్కనే ఉన్న జన సైనికులు తమ మొబైల్ టార్చ్ లైట్స్ ఆన్ చేసి సమావేశాన్ని కొనసాగేలా చేశారు. అయితే పవన్ చేసేదేమీ లేక ఫోన్ల లైట్స్ వెలుగుల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఆ ఫొటోలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారం కైవసం చేసుకొని, ఏపీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ వెలుగులు నింపేనా? అన్నట్టుగా ఉన్నాయి ఆ ఫొటోలు.

 

  Last Updated: 21 May 2022, 08:02 AM IST