PK: ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్న ‘పవన్ కళ్యాణ్’..!!

ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని ఆయన సందర్శించారు.

  • Written By:
  • Updated On - February 8, 2022 / 12:11 PM IST

ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని ఆయన సందర్శించారు. అలానే సమతామూర్తి విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను కూడా దర్శించి పూజలు చేశారు. అనంతరం చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు జనసేనాని.

ఇక తమ ఆశ్రమానికి వచ్చిన జనసేన చీఫ్ పవన్ ను చిన్నజీయర్ స్వామి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఆశ్రమ విశేషాలను, సహస్రాబ్ది ఉత్సవ వివరాలను తెలిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. సమానత్వంపై తన అభిప్రాయాలను జనసేనాని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో.. ఆశ్రమంలోనూ కోలాహలం నెలకొంది. పవన్ ను చూసేందుకు… ఆయన ప్రసంగం వినేందుకు అక్కడున్న భక్తజనంతో పాటు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరం సందర్శనకు పవన్ తో పాటు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ కూడా వచ్చారు.