జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల ఐదో తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ పాల్గొనే ఈ సమావేశంలో పి.ఏ.సి.సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, విభాగాల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జిలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కోర్డినేటర్లు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పాలన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం, పెరిగిన విద్యుత్ చార్జీలు, రైతులు-వ్యవసాయ స్థితిగతులు, వచ్చే కొద్ది నెలలలో పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
