Pawan Kalyan: మరో రీమేక్ లో ‘పవన్’… మేనళ్లుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా 'భీమ్లా నాయక్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Sai Dharam Imresizer

Pawan Kalyan Sai Dharam Imresizer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ కూడా ఫుల్ జోష్ లో సక్సెస్ మీట్, సక్సెస్ పార్టీ అంటూ హడావిడి చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ విడుదల కానుంది. పవన్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మార్చి రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.

‘హరిహర వీరమల్లు’ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీని చేయనున్నారు పవర్ స్టార్. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాల్సి ఉండగా… పవర్ స్టార్ మాత్రం తన సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యారనే వార్త ఎప్పటినుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఆ సినిమాని పట్టాలెక్కించేందుకు పవన్ రెడీగా ఉన్నారని అంటున్నారు.

మేనళ్లుడితో పవన్ కళ్యాణ్ తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’​ రీమేక్ లో నటించనున్నారని తెలుస్తోంది. దర్శక, నటుడు సముద్రఖని దర్శకత్వంలో తమిళనాట విజయం సాధించింది ‘వినోదయ సీతమ్’​ సినిమాని. ఈ సినిమా రీమేక్ గా వస్తున్న సినిమాకి పలు పేర్లను పరశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి అప్పుడే పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇచ్చారని… కేవలం 20 రోజుల కాల్షీట్స్ మాత్రమే కేటాయించారని ఫిల్మ్ నగర్ టో టాక్ వినిపిస్తోంది. మరి వరస రీమేక్స్ తో విజయాలని అందుకుంటున్న పవర్ స్టార్… ఈసారి తన మేనళ్లుడితో కలిసి హిట్ కొట్టనున్నారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మరోవైపు వరుస రీమేక్ లలో పవన్ నటిస్తుండడాన్ని… ఆయన ఫ్యాన్స్ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు.

  Last Updated: 03 Mar 2022, 10:35 AM IST