Site icon HashtagU Telugu

PK Holi: భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ – ‘పవన్ కళ్యాణ్’

Media Coverts

Pawan Holi

భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన ఉల్లాసకరమైన పండుగ ‘హోలీ’ అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వసంత రుతువులో వచ్చే ఈ పండుగను… వసంతోత్సవంగా జరుపుకొనే ఈ వేడుక వేళ, దేశ ప్రజలందరికీ నా తరపున, జనసేన తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మన దేశంలో వివిధ పేర్లతో, వివిధ పురాణాల నేపథ్యంలో ఈ పండుగ జరుపుకొంటున్నప్పటికీ… భారతీయలు ఐక్యతకు ప్రతీకగా హోలీ శతాబ్దాల తరబడి విరాజిల్లుతోంది. రంగులు, పూల సమ్మేళనంతో నిండి ఉండే ఈ పండుగలానే ప్రజలందరి జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖ శాంతులు విరబూయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగను ప్రకృతి పరంగా లభించే సహజ సిద్ధమైన రంగుల మిశ్రమాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.