Site icon HashtagU Telugu

Jana Sena: రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నరసాపురం బయలుదేరారు.

పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ PAC సభ్యులు కొణిదల నాగబాబు కూడా వున్నారు. PAC సభ్యులు పితాని బాలకృష్ణ, మేడా గురుదత్ ప్రసాద్, డి ఎం ఆర్ శేఖర్, వై. శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, పాటంసెట్టి సూర్యచంద్ర, అత్తి సత్యనారాయణ తదితరులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికిన వారిలో వున్నారు.