Exclusive: ఓటీటీలోకి ‘భీమ్లానాయక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘భీమ్లా నాయక్’ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది.

  • Written By:
  • Publish Date - March 5, 2022 / 01:09 PM IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘భీమ్లా నాయక్’ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. సమ్మర్ సీజన్ లో విడుదల కాబోయే భారీ బడ్జెట్ సినిమాలకు ‘భీమ్లానాయక్’తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ మొత్తంలో పొందిన భీమ్లానాయక్ మార్చి చివరి వారంలో తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో  స్ట్రీమింగ్‌ కానున్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమై ఈ నెల చివరి శుక్రవారం భీమ్లానాయక్ ఓటీటీలో రాబోతోంది.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం మొదటి వారంలో రూ. సుమారు 110 కోట్లు సాధించినట్టు టాక్. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. ఇది 2020 మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు రాశారు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ఎస్. థమన్ సంగీతం అందించారు.