Site icon HashtagU Telugu

PK : పవన్ నోట పొత్తు మాట

జనసేనాని పొత్తులపై నోరు విప్పాడు. కొన్ని పార్టీలు జనసేనతో పొత్తు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాయని పరోక్షంగా టీడీపీ ప్రయత్నాన్ని ప్రస్తావించాడు. పార్టీ క్యాడర్ తో నిర్వహించిన వీడియో సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బీజేపీ తో కలిసి ఉన్నామని గుర్తు చేసాడు.

పొత్తు లపై మైండ్ గేమ్ కూడా నడుస్తుందని అభిప్రాయ పడ్డాడు. అందరితో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు.
పవన్ వ్యాఖ్యలు పరిశీలిస్తే పొత్తుపై ఆయన సీరియస్ గా ఆలోచిస్తున్నాడని అర్థం అవుతుంది. సరైన టైం లో నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో పార్టీ ఇటీవల బల పడిందని అంచనా వేసాడు. అంటే పొత్తు కోరుకునే పార్టీ ముందు డిమాండ్ ఎక్కువగా చేసే ప్రయత్నం మొదలు పెట్టాడని అర్థం అవుతుంది. ఆ లోపు సంస్థా గతంగా బలపడాలని దిశానిర్దేశం చేసాడు.

మొత్తం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు పొత్తు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. అది ఎలా? ఎప్పుడు అనేది ఇంకా టైం పెట్టేలా కనిపిస్తుంది. టీడీపీ పంచన మళ్ళీ జనసేన చేరితే అప్పుడు బీజేపీ ఏమి చేస్తుందో ..చూడాలి!

Exit mobile version