Site icon HashtagU Telugu

Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ…

Pawan Kalyan Delhi Tour

Pawan Kalyan Delhi Tour

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జలజీవన్‌ మిషన్‌ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, అలాగే ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై ప్రధాని మోదీతో పవన్‌ చర్చించారు.

ఇంతకు ముందు, కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌ను కూడా పవన్‌కల్యాణ్‌ కలిశారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, దిల్లీలో ప్రధానమంత్రి మరియు పలువురు కేంద్రమంత్రులతో పవన్‌ ఈ భేటీకి వస్తున్నది ఇదే తొలిసారి.

మరోవైపు, పవన్‌ కల్యాణ్‌ను భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు.