Fire Accident : తమిళనాడు సీఎం స్టాలిన్ కు జనసేన అధినేత లేఖ..

  • Written By:
  • Updated On - July 30, 2023 / 12:30 PM IST

జనసేన అధినేత (Jana Sena Chief) పవన్ కళ్యాణ్…తమిళనాడు సీఎం స్టాలిన్ కు లేఖ రాసారు. శనివారం సాయంత్రం తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కృష్ణగిరి పట్టణంలో బాణాసంచా గోదాము(Firecracker Factory) లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బాణాసంచా దుకాణం యజమాని, అతని భార్య, కొడుకు, కూతురు ఇలా మొత్తం కుటుంబ సభ్యులు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులంతా మరణించడం అందర్నీ శోక సంద్రంలో పడేసింది.

ఈ ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణగిరి పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాదం దిగ్బ్రాంతికి గురి చేసిందని, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం, అలాగే మరో ఐదుగురు ఈ ప్రమాదంలో లో చనిపోవడం ఎంతో బాధేసిందని , నిండు నూరేళ్లు జీవించవలసిన బతుకులు ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం విచారకరమన్నారు.

ఈ ప్రమాదం కారణంగా ఒక దుకాణం, మరో మూడు ఇళ్లు కూలిపోయి అందులో అనేకమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఇది ఎంతో ఆందోళనకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు తగినంత నష్టపరిహారం అందజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ (Tamil Nadu CM Stalin) ను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేఖ లో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుండి కూడా ఎవరు ఆపదలో ఉన్న , ఎలాంటి విపత్తులు జరిగిన స్పందిస్తూ..తనవంతు సహాయం అందజేస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అందరు ఇష్టపడుతూ, అభిమానం పెంచుకుంటుంటారు. ప్రస్తుతం పవన్ సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. తాజాగా ఈయన నటించిన బ్రో మూవీ శుక్రవారం విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Read Also : Special Trains: 250కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్న భారతీయ రైల్వే శాఖ.. కారణమిదే..?