Site icon HashtagU Telugu

AP : వైసీపీ దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం..బెదిరించడం – పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan key comments on YCP

Pawan Kalyan key comments on YCP

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ పార్టీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం..బెదిరించడం కానీ మన జనసేన సిద్ధాంతం అదికాదని , త్యాగం, బాధ్యత జవాబుదారీతనం అని అన్నారు పవన్ కళ్యాణ్. శుక్రవారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో నేతలతో పవన్ సమావేశం ఏర్పాటు చేసారు.

ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి..జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేయాలి

ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాల గురించి మాట్లాడాడారు. వైసీపీ (YCP) పార్టీ ని గద్దెదించి..జనసేన పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వైసీపీ దృష్టిలో రాజకీయం అంటే బెదిరించడం..భయపెట్టడం అని, సామాన్య ప్రజలను రాజకీయాల్లోకి రాకుండా వైసీపీ చేస్తుందన్నారు. ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఓటర్ తో మాట్లాడాలి..ఒకసారి కాదు పదిసార్లు మాట్లాడాలి…వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలి..జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంత మేలు జరుగుతుందో వివరించాలి. జనాల్ని దోచుకునే నేతలు కాదు, తమ సొమ్మును పంచే నేతలు కావాలి. డబ్బుతో ఓట్లు కొనమని చెప్పడం లేదు. కానీ, నాయకులు కావాలంటే ఎంతోకొంత ఖర్చు పెట్టి తీరాలి.. తప్పదు. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరు. వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలి. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తాం. మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు..అని పవన్ అన్నారు.

ప్రతి జనసేన కార్యకర్తకు నాయకుడు అండగా ఉండాలి 

శ్రీకాకుళంలో సీఎం జగన్ దిష్టి బొమ్మను తగలబెడితే మన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. అటువంటి వారికి మన నాయకులు అండగా ఉండాలి కదా..?. బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేస్తే నేను స్పందించాను. మన జనసేన నాయకులపై దాడి జరిగితే కనీసం స్పందించరా..?. ఎన్డీఏ సమావేశంలో మనకు ఇచ్చిన ప్రాధాన్యత చూశారు… నిజాయితీగా పని చేస్తే గుర్తింపు అదే వస్తుంది. పరాజయంలో వచ్చే నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది. అయినా ఎన్నో తట్టుకుని ప్రజల కోసం నేను నిలబడ్డాను. ఒక్కసారి మాట ఇస్తే కంఠం తెగి పడే వరకు అలాగే ఉంటానన్నారు. నా దేశం కోసం పని చేస్తున్నా అని అనుకోవాలి. జగన్, ఆయన అనుచరులు మానవవనరులను దోపిడీ చేస్తున్నారు. వాటిపై అందరం కలిసి పోరాటం చేయాలి” అని పవన్‌ పిలుపునిచ్చారు.

నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వరు 

రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలనను తరిమి కొట్టాలి.. జనసేనను అధికారంలోకి తీసుకురావాలి. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్దం గా ఉన్నారు.. నాయకులే లేరు. పది వేల ఓట్లు తెచ్చుకోలేని‌ వారు నాయకుడు అంటే ఎలా..?. నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వరు. కలిసినవారినే కలవడం అంటే నాకు సమయం వృథా. ప్రజలకు చేరవగా ఉంటూ వారిని తమ ఓటర్లుగా మార్చుకోవాలి. 2019 విధానం కాకుండా సరికొత్త విధానంలో అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. స్థానిక అంశాలు, అభిప్రాయాలు, సర్వే నివేదికల ద్వారా సీట్లు ఉంటాయి. అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లింది. విశాఖ వారాహి యాత్రతో మరింత బలంగా జనసేన దూసుకెళ్తోంది. అక్కడ దోపిడీ, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తాం అన్నారు పవన్.

నా సినిమాల గురించి..కాదు పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి 

బ్రో మూవీ ఫై జరుగుతున్న వ్యవహారం ఫై పవన్ స్పందిస్తూ..నేతలకు చిన్నపాటి క్లాస్ పీకారు. వైసీపీ నాయకులు ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలు మహిళల అదృశ్యం, పోలవరం, చిన్నారుల ట్రాఫికింగ్ వంటి అంశాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. దానిని మనం గమనించాలి అంతే తప్పా..వారిలా మీరు కూడా డిబేట్ లలో కూర్చుని పనికి రాని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని పవన్ ఫైర్ అయ్యారు.

రాజకీయాలను రాజకీయాలుగానే చూడండి, ఇక్కడకు సినిమాను తీసుకురాకండి అంటూ హెచ్చరించారు. నేను రాజకీయంగా నడవాలంటే నాకు సరైన ఇంధనం సినిమానే అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నా గురించి , నా సినిమాల గురించి వైసీపీ (YCP) నేతలు అలాగే మాట్లాడతారు..దానికి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలే నేనే బ్రో సినిమాను వదిలేసా..మీరెందుకు దాన్నే పట్టుకుంటున్నారు..నేను సినిమా షూటింగ్ చేశా..డబ్బింగ్ చేశా..ప్రమోషన్ కార్య క్రమాల్లో పాల్గొన్న..అంతే అయిపోయింది. మీరెందుకు దాని గురించి డిబేట్ లలో మాట్లాడి టైం వెస్ట్ చేసుకుంటున్నారు..వైసీపీ నేతలకు మీకు తేడా ఏంటి అని ప్రశ్నించారు. జనసేన నాయకుల స్థాయి పెరగాలి. వాళ్ల స్థాయికి మీరు దిగజారొద్దు. నన్ను తిడితే నా శరీరంలో చిల్లులు పడిపోవు కదా. మనం ఏది మాట్లాడినా రాష్ట్రం, ప్రజల కోసం అనేలా ఉండాలి అన్నారు.

Exit mobile version