Site icon HashtagU Telugu

Pawan Kalyan: అమిత్ షా తో భేటీ కాబోతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan Birthday Celebrations by Janasena Party

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27వ తేదీన సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో సీట్ల సర్దుబాటుపై వారిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ చీప్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్‌‍లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం వచ్చే అమిత్ షాతో పవన్ భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా కొన్ని సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తిగా మారింది.