బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడని.. అన్నలాంటి వాడంటూ చెప్పారు. అనేక సార్లు చాలా విషయాలు ఇద్దరం కలిసి చర్చించామంటూ చెప్పారు. చాలా విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని అందుకే తక్కువ టైంలోనే మంచి స్నేహితులుగా మారామన్నారు. అయితే రాజకీయాల విషయంలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉంటామంటూ కేటీఆర్ చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో కూడా బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని, ఏపీ ప్రజలు ఆదరిస్తే ఏదైనా జరగొచ్చని చెప్పారు. తమ అపోనెంట్ బీజేపీ తప్ప వేరెవరూ కాదన్నారు మంత్రి కేటీఆర్. తనకు లోకేష్, వైఎస్ జగన్ కూడా మంచి మిత్రులంటూ చెప్పారు. ఆ రెండు పార్టీలతో తమకు వచ్చిన సమస్య ఏదీ లేదని.. కానీ ప్రస్తుతం వాళ్లిద్దరూ బీజేపీతో సన్నిహితంగానే ఉన్నారంటూ చెప్పారు. ఏపీలో ఏ పార్టీ బీజేపీని ప్రశ్నించే స్థాయిలో లేదంటూ చెప్పారు.
Also Read: Rashmika Mandanna: శ్రీవల్లి షూట్స్ బిగిన్.. పుష్ప2 సెట్ నుంచి రష్మిక ఫొటో షేర్