Site icon HashtagU Telugu

Pawan Kalyan : రాజకీయాలకు పవన్ స్మాల్ బ్రేక్..?

pawan kalyan have a small break to politics

pawan kalyan have a small break to politics

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు స్మాల్ బ్రేక్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు , మరో పక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ రెండిటిని బాలన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలా షూటింగ్ ను పూర్తి చేసి, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావాలని చూస్తున్నారు.

పవన్ ప్రస్తుతం OG తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) మూవీస్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల నుండి నవంబర్ వరకు ఈ చిత్రాల షూటింగ్ లు పూర్తి చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ఆ మేరకు షెడ్యూల్స్ ప్లాన్ చేయాలనీ మేకర్స్ కు సూచించారట పవన్.

OG మూవీ షూటింగ్ సుమారు 60 శాతం మేర పూర్తి అయ్యింది. రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ (Sujith) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ నటి ప్రియాక అరుల్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఈ సినిమాకి సంబంధించి అక్టోబర్ లో 20 రోజులు, నవంబర్లో ఎనిమిది రోజులు పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. 20 రోజులు పాటు షూటింగ్ బ్యాంకాక్ లో ఉంటుందని.. వాటికి సంబంధించి స్పాట్లను గుర్తించే పనిలో యూనిట్ ఉంది. అక్టోబర్, నవంబర్ లో పవన్ సినిమా షూటింగుల్లో పాల్గొంటారు. ప్రస్తుతం మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నారు. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ (Harish Shankar) ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే నెల కల్లా పవన్ కు సంబదించిన షూటింగ్ అంత పూర్తి చేయాలనీ మేకర్స్ చూస్తున్నారు.మొత్తం మీద ఈ మూడు నెలలు పవన్ సినిమాలతో బిజీ గా ఉండనున్నారు. ఆ తర్వాత మొత్తం ఏపి పైనే దృష్టి పెట్టనున్నారు.

Read Also : CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్