Site icon HashtagU Telugu

Pawan Kalyan: ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కు ఘనస్వాగతం

pawan kalyan

pawan kalyan

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేస్తారు. అంతకు ముందు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు చింతా సురేష్, శ్రీమతి రేఖా గౌడ్, శ్రీమతి హసీనా బేగం, అర్షద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, అనంతపురం జిల్లా నాయకుడు పెండ్యాల హరి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా శిరివెళ్ళ బయలుదేరారు.