Site icon HashtagU Telugu

Jana Sena: ‘పవన్’ ఔదార్యం… బీమా లేకున్నా మరణించిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల సాయం..!

pawan kalyan

pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జనసైనికులంటే ప్రాణప్రదం. వారికి కష్టమొస్తే ఆదుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరన్న సంగతి అందరికీ తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం నియోజకవర్గం, జనుపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త తవిటికి వెంకటేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

దురదృష్టవశాత్తు వెంకటేష్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోలేకపోయారు. జనసేన పార్టీలో మొదటి నుంచి నిబద్ధత కలిగిన కార్యకర్తగా సేవలు అందించిన వెంకటేష్ అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. పార్టీ నాయకుల ద్వారా వెంకటేష్ కుటుంబ ధైన్య స్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చలించి పోయారు. జనసైనికులను తన కుటుంబ సభ్యులుగా భావించే పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం లేనప్పటికీ, బీమా సదుపాయం ఉన్న సభ్యులకు అందించే విధంగా రూ. 5 లక్షలు వెంకటేష్ కుటుంబానికి అందించి ఆదుకోవాలని నిర్ణయించారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు త్వరలోనే రూ. 5 లక్షల చెక్కును అందించనున్నారు.