Site icon HashtagU Telugu

PK: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి పవర్ స్టార్ ఆత్మీయ సత్కారం.!

pawan kalyan

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. శుక్రవారం ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ మొదలైంది. పవన్ కళ్యాణ్ 60 రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చిన నేపథ్యంలో దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టోడోర్ లాజరోవ్ నేతృత్వంలో కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాత ఏ.ఎం రత్నం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ ‘హరిహర వీరమల్లు’ లో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ ను అద్భుతంగా వేయించిన ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సెట్లోనే సత్కరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి ఆత్మీయ సత్కారం చేశారు. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘హరిహర వీరమల్లు’ కోసం తోట తరణి అద్భుతమైన సెట్స్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. 17వ శతాబ్దం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఆ సెట్స్ ను చూసి పవన్ కళ్యాణ్ ఎంతో ముగ్ధుడైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తోట తరణిని పవన్ కళ్యాణ్ సత్కరించారు.