Site icon HashtagU Telugu

Bheemla Nayak: గుంటూరులో థియేట‌ర్ వ‌ద్ద‌.. పవన్ ఫ్యాన్స్ రచ్చ..!

Bheemla Nayak Guntur

Bheemla Nayak Guntur

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ మూవీ ఈరోజే థియేట‌ర్స్‌లో విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేట‌ర్స్‌లో భీమ్లా నాయ‌క్ బొమ్మ ప‌డింది. భీమ్లా నాయ‌క్ బెనిఫిట్ షోల‌కు తెలంగాణ స‌ర్కార్ అనుమ‌తి ఇవ్వ‌గా, ఏపీలో మాత్రం బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. అయినా కూడా ఏపీలో ప‌లు ప్రాంతాల్లో ఉన్న థియేట‌ర్స్‌లో బెనిఫిట్ షోలు వేశార‌నే వార్త‌లు వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలో గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో ఉన్న‌ ఈశ్వరసాయి థియేటర్ య‌జ‌మాన‌లు భీమ్లా నాయ‌క్ మూవీ బెనిఫిట్ షో ఉందంటూ టికెట్లు విక్ర‌యించింది. ఒక్కో టిక్కెట్ ను మూడు వందల నుంచి ఐదు వందల వరకూ విక్రయించింది. అయితే ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో వేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో షో రద్దయింది. దీంతో బెనిఫిట్ షో ఉందంటూ ముందుగానే టికెట్స్ కొనుక్కున్నారు పీకే ఫ్యాన్స్ ఈశ్వరసాయి థియేటర్ వ‌ద్ద‌ ఆందోళనకు దిగారు. ఈ క్ర‌మంలో థియేటర్ యజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయ‌గా, మార్నింగ్ షోకు అనుమతిస్తామని చెప్పడంతో అభిమానులు శాంతించారు.