గత నాల్గు రోజులుగా ఏపీలో బ్రో మూవీ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బ్రో (BRO) మూవీ లో తనను అవమానించేలా క్యారెక్టర్ ను పెట్టారని..డాన్సులు చేయించారని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలు మీడియా సమావేశాలు ఏర్పటు చేసి బ్రో సినిమా ఫై , పవన్ కళ్యాణ్ ఫై పలు ఆరోపణలు చేసారు. ఈ క్రమంలో జనసేన నేతలు సైతం తగ్గేదెలా అంటూ అంబటి రాంబాబు ఫై సినిమా షూటింగ్ లు మొదలుపెట్టడం..పలు టైటిల్స్ అనుకుంటున్నట్లు చెప్పడం తో మరింత వివాదం చెలరేగింది. ఈ ఇష్యూ ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు.
మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయగా..నాగబాబు , నాదెండ్ల మనోహర్ తో పాటు రాష్ట్ర పార్టీ నేతలు , కీలక వ్యక్తులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ..వైసీపీ నాయకులు ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలు మహిళల అదృశ్యం, పోలవరం, చిన్నారుల ట్రాఫికింగ్ వంటి అంశాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. దానిని మనం గమనించాలి అంతే తప్పా..వారిలా మీరు కూడా డిబేట్ లలో కూర్చుని పనికి రాని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని పవన్ ఫైర్ అయ్యారు.
రాజకీయాలను రాజకీయాలుగానే చూడండి, ఇక్కడకు సినిమాను తీసుకురాకండి అంటూ హెచ్చరించారు. నేను రాజకీయంగా నడవాలంటే నాకు సరైన ఇంధనం సినిమానే అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నా గురించి , నా సినిమాల గురించి వైసీపీ (YCP) నేతలు అలాగే మాట్లాడతారు..దానికి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలే నేనే బ్రో సినిమాను వదిలేసా..మీరెందుకు దాన్నే పట్టుకుంటున్నారు..నేను సినిమా షూటింగ్ చేశా..డబ్బింగ్ చేశా..ప్రమోషన్ కార్య క్రమాల్లో పాల్గొన్న..అంతే అయిపోయింది. మీరెందుకు దాని గురించి డిబేట్ లలో మాట్లాడి టైం వెస్ట్ చేసుకుంటున్నారు..వైసీపీ నేతలకు మీకు తేడా ఏంటి అని ప్రశ్నించారు. దయచేసి టీవీ డిబేట్ లలో కూర్చున్నప్పుడు సినిమాల గురించి మాట్లాడవద్దని..జనసేన పాలసీ గురించి మాట్లాడాలని సూచించారు.
Read Also : BRS Point : అసెంబ్లీలో రేవంత్ పవర్, చంద్రబాబు కల్చర్