Site icon HashtagU Telugu

Jalsa Creates Records: జల్సా రీ-రిలీజ్ రికార్డ్.. థియేటర్స్ హౌస్ ఫుల్!

Jalsa

Jalsa

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి రీరిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ చిత్రం జల్సా రీ-రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 51వ పుట్టినరోజు (సెప్టెంబర్ 2న) సందర్భంగా అభిమానులు, పంపిణీదారులు 2008 చిత్రం జల్సాను తిరిగి విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విశేష స్పందన వస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన స్పెషల్ షోలు 4కె క్వాలిటీతో రన్ అవుతోంది.

జల్సా స్పెషల్ స్క్రీనింగ్ కోసం 501 షోలు ఏర్పాటు చేసి జనసేన అధినేత అభిమానులు రికార్డులు సృష్టిస్తున్నారని సమాచారం. పవన్ అభిమానులు సేకరించిన మొత్తాన్ని జనసేనకు విరాళంగా అందజేస్తారని, ఆ మొత్తంలో కొంత భాగాన్ని చనిపోయిన రైతుల కుటుంబాలకు వినియోగిస్తామన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. జల్సా నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే ట్రెండ్ సెట్ చేయబడింది. గీతా ఆర్ట్స్ పతాకంపై పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ, ముఖేష్ రిషి మరియు ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ చిత్రం ఇప్పటికీ క్లాసిక్ బ్లాక్ బస్టర్ కావడానికి మరొక కారణం.