ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) నేడు మొదటిసారి సచివాలయంకు వచ్చారు. రేపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్ ను పరిశీలించారు. సచివాలయం ఉద్యోగులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు (Chandrababu)తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర సేపు వీరి భేటీ నడిచింది. ఈ సమావేశంలో చాల విషయాల గురించి ఇరువురు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
తన శాఖలకు సంబంధించి ఏం చేయాలి? ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అన్నదానిపై చంద్రబాబుతో పవన్ చర్చించినట్లుగా సమాచారం. తనకు పాలనపై అనుభవం లేకపోవడంతో పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని.. తనవైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే నామినేటేడ్ పోస్టుల్లో తమకు కూడా కొన్ని కేటాయించాలని, తమకు కూడా కొంత న్యాయం చేయాలని చంద్రబాబును పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దానికి చంద్రబాబు నుండి సానుకూలంగా స్పందన వచ్చిందని అంటున్నారు.
అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడలోని ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌కు పవన్ కళ్యాణ్ వెళ్లడం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పవన్ కు స్వాగతం పలికారు. అనంతరం అతిధి గృహాన్ని పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా పవన్ వెంట ఉన్నారు. రెండు అంతస్తుల ఈ అతిధి గృహంలో పై అంతస్తులో నివాసం, దిగువ అంతస్తులో కార్యాలయం ఏర్పాటుపై చర్చించారు. సమాచారం. ఈ గెస్టుహౌస్‌లో కొన్ని మార్పులను పవన్ సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ క్యాంపు కార్యాలయాన్ని అప్పటి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావు వినియోగించారు. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ కొంత భాగాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించగా మరికొంత జలవనరుల శాఖ కార్యాలయంగా ఉంది. ఇప్పుడు మొత్తం కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ తన క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నారు.
Read Also : KCR : కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు బిజెపి ప్లాన్ – జగదీష్ రెడ్డి