Site icon HashtagU Telugu

MLC Elections : ఎమ్మెల్సీ ఓటు వేయలేకపోతున్న పవన్..ఎందుకంటే..!!

Pawan Kalyan

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాడేపల్లి (మండల పరిషత్) స్కూల్లో ఈ నెల 27న వీరిద్దరూ ఓటు వేయనున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధినేతలు, పార్టీ కీలక నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Fact Check : ‘‘30 కోట్లిచ్చి టికెట్ తెచ్చుకున్నా’’.. ఇవి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యలేనా ?

అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాత్రం ఈ ఎన్నికలలో ఓటు వేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం, ఆయన పట్టభద్రుడు కాకపోవడం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే పట్టభద్రుడిగా నమోదై ఉండాలి. పవన్ కల్యాణ్ విద్యా అర్హతలు ప్రస్తుత ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

Aegis Graham Bell Awards : ఫైనలిస్ట్‌గా కెమిన్ ఆక్వాసైన్స్ గుర్తింపు

ఇక, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా తాడేపల్లిలో నివాసం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన రాజకీయ నాయకుల ఓటింగ్ హక్కులపై చర్చ జరుగుతోంది. విద్యావంతుల ప్రతినిధులుగా ఎమ్మెల్సీలు ఎన్నికవుతుండటంతో ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది.