Site icon HashtagU Telugu

Viral Video: మద్యం మాఫియా క్రియేటివిటీ.. గ్యాస్ సిలిండర్లలో లిక్కర్ రవాణా!!

Screenshot 2022 04 15 At 2.32.27 Pm Imresizer

Screenshot 2022 04 15 At 2.32.27 Pm Imresizer

అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళ భరతం పట్టేలా పోలీసులు ఎంతలా అప్ డేట్ అవుతున్నారో.. అక్రమార్కులు అంతకు మించిన క్రియేటివిటీ తో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బిహార్ లో ఇటువంటిదే ఒక ఘటన వెలుగు చూసింది. బిహార్ లో 2016 సంవత్సరం లో నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్య నిషేధం అమల్లో ఉంది. మద్యం తయారు చేస్తూ, విక్రయిస్తూ దొరికే వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు.

భారీ జరిమానాలు వసూలు చేస్తున్నారు. దీంతో పోలీసులు, ఎక్సయిజ్ విభాగం కళ్ళు కప్పి మద్యం తరలింపునకు కొందరు అక్రమార్కులు కొత్త ఐడియా తయారు చేశారు. ఎవరికీ సందేహం రాదనే ఉద్దేశంతో.. మద్యాన్ని వంట గ్యాస్ సిలిండర్లలో నింపారు. ఈవిధంగా పాట్నాలో గ్యాస్ సిలిండర్లలో 50 లీటర్ల మద్యం తో వెళ్తున్న ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ సిలిండర్లను జప్తు చేశారు. మద్యం తో నింపిన సిలిండర్లను పోలీసులు స్థానిక మీడియా ప్రతినిధులకు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

https://twitter.com/niteshmisan/status/1514548286371217408