Modi Surname Case: కర్ణాటక ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది పాట్నా కోర్టు. ప్రధాని నరేంద్ర మోడీపై గతంలో రాహుల్ చేసిన కామెంట్స్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఒక వర్గాన్ని అవమానపరిచాయని పేర్కొంటూ బీజేపీ నేత ఒకరు కోర్టులో కేసు వేశారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మరీ ముఖ్యంగా తన ఎంపీ అర్హతను కోల్పోయారు రాహుల్.
రాహుల్ ఏప్రిల్ 25న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టు ఊరట కల్పించింది.మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ సందీప్ కుమార్‌తో కూడిన సింగిల్ బెంచ్ సోమవారం ఈ కేసును విచారిస్తూ, కేసు తదుపరి విచారణను మే 15కి ఫిక్స్ చేసింది. మోదీ ఇంటిపేరుపై చేసిన ప్రకటనపై ఏప్రిల్ 25న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది. హైకోర్టు స్టే విధించిన తర్వాత ఏప్రిల్ 25న హాజరుకావాల్సిన అవసరం లేదు.
Read More: IT Raids: వైట్ ఎంత? బ్లాక్ ఎంత? ప్రభాస్, అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై ఐటీ ఆరా!