Site icon HashtagU Telugu

Patna: ఇదేమన్నా సినిమా హాలు అనుకున్నారా..? ఐఏఎస్ అధికారిని ఏకిపారేసిన జడ్జి…వైరల్ వీడియో..!!

Patna Hc1 1200x768

Patna Hc1 1200x768

కోర్టులో ప్రోటోకాల్ తెలియక జడ్జిచేతిలో అక్షింతలు వేయించుకున్నాడో సీనియర్ ఐఏఎస్ అధికారి. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ కిశోర్ ఓ కేసులో పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. ఆయన ధరించిన దుస్తులు జడ్జీ పీబీ భజంత్రీకి కోపం తెప్పించాయి. దాంతో ఆ ఐఏఎస్ అధికారిని ఏకిపారేశారు.

సాధారణ డ్రెస్ వేసుకుని రావడానికి ఇదేమన్నా సినిమాహాలు అనుకుంటున్నారా…ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఎలాంటి డ్రెస్సుకు ధరించి కోర్టుకు రావాలో మీకు తెలియదా…ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీరు…ముస్సోరీలో మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు…కోర్టుకు హాజరయ్యేటప్పుడు వేసుకోవాల్సిన దుస్తుల గురించి మీకు అక్కడ బోధించలేదా..?మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని మీకు తెలియదా…కనీసం కోట్ అయినా ధరించాలి కదా..అంటూ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉతికారేశారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా జడ్జి చేతిలో మొట్టికాలు తిన్న ఆ అధికారి ఆనంద్ కిషోర్ బీహీర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు.