Site icon HashtagU Telugu

Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది ప్యాసింజర్స్ ప్రమాణం

Passenger plane crashes in Kazakhstan

Passenger plane crashes in Kazakhstan

Plane Crash : కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది. విమానం క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో విమానంలో 110 మంది వరకు ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా దీన్ని దారి మళ్లించారు. కజికిస్తాన్‌లోని అక్టావ్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్గటన సంభవించింది. అక్టావ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు అందిన తరువాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించిందా ఫ్లైట్. సాధ్యపడలేదు. క్రాష్ ల్యాండింగ్‌కు గురైంది. కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కుప్పకూలింది. భూమిని తాకిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు చెబుతున్నారు.

ఇకపోతే..ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎంతమంది మరణించి ఉండొచ్చనేది తెలియరావట్లేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానంలో ఉన్న 72 మందీ మరణించి ఉండొచ్చంటూ ప్రాథమిక అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Read Also: BRS : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు