Site icon HashtagU Telugu

Plane Crash: అఫ్గానిస్థాన్‌లో కుప్పకూలిన ప్యాసింజర్ విమానం …

Plane Crash

Plane Crash

Plane Crash: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రయాణికులతో వెళుతున్న విమానం కుప్పకూలినట్లు ఆఫ్ఘన్ మీడియా పేర్కొంది. రష్యా రాజధాని మాస్కో వెళ్తున్న ఓ విమానం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో కుప్పకూలింది. అది భారత విమానం కాదని డీజీసీఏ అధికారి ధృవీకరించారు. ఈ విమానం చిన్న సైజు విమానం. బదక్షన్ ప్రావిన్స్‌లోని కురాన్-ముంజన్ మరియు జిబాక్ జిల్లాల వెంట ఉన్న పర్వతాలపై కూలిపోయింది.

రష్యా రాజధాని మాస్కోకు బయల్దేరిన డీఎఫ్-10 విమానం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో కూలిపోయింది. సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం విమానం కూలిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం బదక్షన్ ప్రావిన్స్‌లోని కురాన్-ముంజన్ మరియు జిబాక్ జిల్లాల వెంట ఉన్న తోప్‌ఖానా పర్వతాలలో విమానం కూలిపోయింది. విమానం ఒక చిన్న సైజు విమానంగా చెప్తున్నారు.

ప్రమాదానికి గురైన విమానం భారతీయ విమానం కాదని ఆఫ్ఘన్ మీడియా తెలిపింది. మొదట భారత్‌కు చెందినదిగా ప్రచారం జరగ్గా.. ఇండియా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ విమానం భారత్‌కు చెందినది కాదని పేర్కొంది. అది మొరాకో రిజిస్టర్డ్ విమానంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానంలో ఆరుగురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా.. ప్రమాదం తీవ్రత.. ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం తెలియరాలేదు.

Also Read: Ram Mandir: అయోధ్య రాముడికి అతి చిన్న సూక్ష్మ పాదుకలు సమర్పించిన స్వర్ణకారుడు?

Exit mobile version