ఆసియానా ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్నందున ఓ ప్రయాణికుడు అత్యవసర డోరును తెరిచాడు. ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు ఆసుపత్రి పాలయ్యారు. ఎయిర్‌బస్ A321-200 దేశీయ విమానంలో సియోల్‌కు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు (149 మైళ్లు) దూరంలో ఉన్న డేగు అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే వద్ద ల్యాండ్ కాబోతోంది. .
200 మంది ప్రయాణికులున్న విమానం భూమి నుండి 200 మీటర్లు (650 అడుగులు) ఎత్తులో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ డోరు దగ్గర కూర్చున్న ఒక ప్రయాణికుడు డోరును తెరిచాడు. ఊహించని విధంగా డోర్ తెరవడం వల్ల కొంతమంది ప్రయాణికులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ల్యాండింగ్ తర్వాత కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. పెద్దగా గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన ఫుటేజీని పరిశీలించగా డోర్ నుండి గాలి లోపలికి వెళ్లడం, చాలామంది ప్రయాణికులు భయాందోళనకు గురవడం, ప్రయాణికుల డ్రస్సు, జుట్టు చెదిరిపోవడం చూడొచ్చు. ఏం జరిగిందో తెలియక కొంతమంది కేకలు వేశారు. ఈ ఘటనలో దాదాపు 9 మంది గాయాల పాలు కాగా, డోరు తెరిచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Man arrested after opening door as plane prepared to land in South Korea, 9 people taken to hospital pic.twitter.com/auWDv1Z6au
— Pranjal Mishra 🇮🇳 (@Pranjal_Writes) May 26, 2023
Also Read: Bandla Ganesh: గురూజీని కలవండి, భారీ గిఫ్ట్ ను అందుకోండి, త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ పంచులు