Site icon HashtagU Telugu

Indigo : ఇండిగో విమానంలో సిబ్బందితో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన ప్ర‌యాణికుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Indigo Flight Gate Locked

Indigo Flight Gate Locked

హైదరాబాద్ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందిప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు.దీంతో ప్రయాణికుడిపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇండిగో ఫ్లైట్ 6E 126లో ఈ ఘటన జరిగింది. పాట్నా విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్ర‌యాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించాడని.. టాయిలెట్‌లోకి వెళ్లే స‌మ‌యంలో సిబ్బందితో దురుసుగా ప్ర‌వ‌ర్తిచిన‌ట్లు ఫిర్యాదులో పేర్కోన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్, వినోద్ పీటర్ ప్రయాణికుడు కమర్ రియాజ్‌గా గుర్తించామ‌ని..అయితే అత‌ను మానసిక వికలాంగుడని తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న చికిత్స తీసుకుంటున్నార‌ని.. అతను మెడికల్ రిపోర్టులు క‌లిగి ఉన్న‌ట్లు తెలిపారు.క‌మ‌ర్ రియాజ్ హైదరాబాద్ నుండి పాట్నాకు ఇండిగో విమానంలో తన బంధువులలో ఒకరితో కలిసి ప్రయాణిస్తున్నాడని పోలీసులు తెలిపాఉ.. ఇండిగో సిబ్బంది దాఖలు చేసిన ఫిర్యాదుతో తాము రియాజ్‌ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Exit mobile version