Parakala Congress: బీఆర్ఎస్ లో చేరిన పరకాల కాంగ్రెస్ నాయకులు

పరకాల కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ, సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇతర సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.

Published By: HashtagU Telugu Desk
Parakala

Parakala

వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ, సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇతర సీనియర్ నాయకులు, యువజన నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజూ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ గా నిలిపారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి విధానాలకు ఆకర్షితులమై తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారందరూ ఈ సందర్భంగా తెలిపారు.

సీఎం కేసీఆర్ నేడు బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నేపథ్యంలో ఆయన నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.కాగా, బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో… గీసుకొండ వైస్ ఎంపీపీ రడం శ్రావ్య భరత్, రాంపూర్ సర్పంచ్ గాజర్ల గోపి, మచ్చాపూర్ మాజీ సర్పంచ్ నమిండ్ల మానస, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొలబోయిన గోవర్దన్, పొలబోయిన శ్రీనివాస్, అల్లం మర్రెడ్డి, కందికొండ రాజు, ఇట్టారి గురువయ్య, యూత్ లీడర్లు పొలెబోయిన సంపత్, గాజర్ల రంజిత్, పేర్ల శ్రవణ్, మంద అనిల్, పులి నాగేశ్, దండబోయిన సుమన్, పొలెబోయిన రాము ఉన్నారు.

  Last Updated: 30 Jan 2023, 04:03 PM IST