Site icon HashtagU Telugu

Blocks Bus: ఈ రైతు నిరసన న్యాయమైంది!

Papaya

Papaya

నాగర్ కర్నూలు జిల్లాలోని, పెద్దకొత్తపల్లి మండలం, మారేడు మాన్ దిన్నె గ్రామం… నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం… ఈ గ్రామానికి కేవలం ఒకే ఒక బస్సు వెళుతుంది… అయితే గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతినిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు.. రోజువారీగా శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా, తనకు ఉచితంగా రైతు పండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో బస్సు డ్రైవర్ ఆ రైతు పండించిన బొప్పాయి పండ్లను బస్సులోకి ఎక్కించుకోలేదు… నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు… దీంతో ఆవేదనకు లోనైన రైతు గోపయ్య ఆ బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో, రోడ్డుపై బొప్పాయి పండ్లతోపాటు ఇలా బైఠాయించి, గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు.