Site icon HashtagU Telugu

హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రారంభం

Kbr Park

Kbr Park

హైదరాబాద్ ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. పంజాగుట్ట-కెబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. 17 కోట్ల రూపాయలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించింది. పంజాగుట్ట-కెబిఆర్ పార్క్ ఫ్లైఓవర్‌ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని ప్రారంభించారు.
పాత గేటు నుంచి హెచ్‌టీ లైన్‌ వరకు ఫ్లైఓవర్‌ కోసం ప్రభుత్వం రూ.17 కోట్లు వెచ్చించింది. ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, రోడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది.