Kidnap: ఏపీలో క‌ల‌క‌లం.. అర్ధ‌రాత్రి కిడ్నాప్‌కు యత్నం

అనంతపురం జిల్లా కంబదూరు వైయస్సార్ సర్కిల్ సమీపంలో ఉన్న కోటవీధిలో బాలుడు కిడ్నాప్ (Kidnap) యత్నం స్థానికంగా కలకలం రేపింది.

  • Written By:
  • Updated On - March 29, 2024 / 11:35 AM IST

Kidnap: అనంతపురం జిల్లా కంబదూరు వైయస్సార్ సర్కిల్ సమీపంలో ఉన్న కోటవీధిలో బాలుడు కిడ్నాప్ (Kidnap) యత్నం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలకు వెళ్తే.. గురువారం రాత్రి ఆర్టీసీ కండక్టర్ బలిజ గంగాధర కుమారుడు గౌతమ్ కౌశిక్ వారి తాతతో కలిసి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. రాత్రి 11 గంటలకు పైగా ఆ ప్రాంతంలో ఒక కారు హల్చల్ చేసినట్లు బాలుడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ వీధిలో ఒక కారు పోయిన 15 నిమిషాలకే గుర్తుతెలియని ఒక వ్యక్తి వచ్చి మంచం మీద పడుకున్న బాలుడుపై చెయ్యి వేసి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా వెంటనే పక్కనే ఉన్న తాతకు చెయ్యి తగలడంతో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించి గట్టిగా కేకలు వేయడంతో బాలుడిని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే బాలుడు తల్లిదండ్రులు100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాలురు కుటుంబ సభ్యులు తెలిపారు. కంబదూరులోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉందని ప్రజలు వాపుతున్నారు.

Also Read: MLC Kavitha: జైలులో కవిత డిమాండ్స్ పై కోర్టు కీలక నిర్ణయం

ఈ వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

కంబదూరు చెక్ పోస్ట్, వైఎస్ఆర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ ,పాత పోస్ట్ ఆఫీస్, పాత బస్టాండ్ ,ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు పోలీసులు కోరుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join