Site icon HashtagU Telugu

Telangana : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

Crime

Crime

లంచం తీసుకుంటూ ఓ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. డిండి గ్రామం, మండల పంచాయతీ కార్యదర్శి రూ.10,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణకు చెందిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఓ వ్య‌క్తి నుంచి అధికారిక పనులు చేసేందుకు సదరు అధికారి లంచం కోరాడు. పంచాయతీ కార్యదర్శి జి శ్రావణ్ కుమార్ … బాధిత వ్య‌క్తి తన తండ్రి తాత పేరు మీద నమోదు చేసిన తన ఇంటి ప్లాట్ వివరాలను అందించడానికి లంచాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి . శ్రావణ్‌కుమార్‌ నుంచి ఏసీబీ అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు విచారణలో ఉంది.