Site icon HashtagU Telugu

ACB Raid : వికారాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయత్ రాజ్ అధికారి

Acb Imresizer

Acb Imresizer

వికారాబాద్‌ జిల్లా యాలాల్‌ మండలంలో లంచం తీసుకుంటు ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎల్‌.మధు .. సివిల్ కాంట్రాక్ట‌ర్ ద‌గ్గ‌ర రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినంద‌కు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శివ కాంట్రాక్ట్ పనిని రిజిస్టర్‌లో నమోదు చేయడానికి, తదుపరి చర్యల‌ కోసం యాలాల్ సబ్ డివిజన్ డివిజనల్ ఇంజనీర్‌కు పంపడానికి, నిందితుడు మధు లంచం కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులకు రూ.30 వేలు లంచం లంచం దొరకడంతో మధును ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద 30,000. స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఇంకా విచార‌ణ‌లో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version