TS Assembly : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం..

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 01:04 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశం రెండో రోజు వాడివేడిగా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రగతి భవన్ కంచెలు తీసి …అసెంబ్లీ ముందు మాత్రం మూడు వేల మంది పోలీసులను పెట్టారు….ఇదేనా మార్పు ? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. వంద ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు కొట్టారు…ఇదేనా మార్పు అంటే ..మార్పు అంటే నంబర్‌ ప్లేట్లు మార్చడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మ హత్యలు లేకుండే .. రైతు భరోసా వెస్తం అన్నారు…రెండు లక్షల ఋణ మాఫీ ఓకే సారి చేస్తాం అన్నారు.. ఏమైంది ? అని ప్రశ్నించారు. కౌలు రైతుల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదన్నారు. రైతు భరోసా ఎందుకు ఇస్థలేరు? అని ప్రశ్నించారు. బెదిరిస్తున్నరు.. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రుల తాపత్రయం పడుతున్నారని పల్లా చెప్పుకొచ్చారు.

గవర్నర్‌ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. మేనిఫెస్టోలోని అంశాలు గవర్నర్‌ ప్రసంగంలో లేవని, హామీ ఊసే లేదన్నారు. ప్రగతి భవన్‌ గతంలో కూడా ప్రజా భవనేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్‌లో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చింది ప్రగతి భవనే అన్నారు. సీఎం రేవంత్‌ కనీసం వారానికి ఒక్కసారి కూడా ప్రజావాణికి హాజరుకాలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకుంటుందని, గవర్నర్‌ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ను నిలదీయాలి…నిధుల కోసం డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో లోపయికారి ఒప్పందం చేసుకుంటే తెలంగాణ సమాజం సహించదన్నారు. కేసీఅర్ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మేము తిట్టడం లేదు.. తెలంగాణ ఎలా వచ్చింది చెబుతున్నామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మహిళలకు ఉచిత బస్సులిచ్చారు.. బస్సుల సంఖ్య పెంచలేదు, ట్రిప్పులు పెంచలేదని విమర్శించారు. ప్రమాణ స్వీకారం రోజునే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇక పల్లా వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మీరు మైండ్ సెట్ మార్చుకోండి ..ఇంకా మీరు అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారని పొన్నం అన్నారు. ఆర్టీసి ఉద్యోగులు ధర్నా చేస్తా బీఆర్ఎస్ సర్కార్ అప్పుడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. 21 మంది అటో డ్రైవర్ లు ఆత్మ హత్యలు చేసుకున్నారు అని సభను తప్పు దారి పట్టిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఉచిత బస్సు ప్రయాణం వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. చాలన్ పేరుతో ఆటో వాళ్ళను వేధించింది మీరు అని గుర్తు చేశారు. బస్సు దగ్గరికి ఆటో లోనే వచ్చేదని, మహిళలకు ఉచిత బస్సు వద్దా చెప్పండి? అని ప్రశ్నించారు. బెంజ్ కార్లో తిరిగే మీరు ఇప్పుడు ఆటో ఎక్కారూ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూడల్స్ మీరు.. ఇప్పుడు ఆటో ఎక్కారు అంటూ మండిపడ్డారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టొద్దు.. ఆత్మహత్యలకు ప్రోత్సహించెట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సొమ్ము అంతా వరంగల్ లో ఒకరు.. కరీంనగర్ లో ఒకరు.. ఆర్ముర్ లో ఒకరు అనుభవిస్తున్నారని పొన్నం మండిపడ్డారు.

Read Also : Bharat Ratna : పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న