Site icon HashtagU Telugu

BRS Party: ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, కౌశిక్

Brs

Brs

BRS Party: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభుత్వం హాయంలో నామినేటేడ్ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేశారు. ఎమ్మెల్సీ పదవులకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు.

రాజీనామాలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓకే తెలిపారు. ఈ మేరకు బి ఆర్ యస్ ఎమ్మెల్సీలు తమ  ఎమ్మెల్సీ పదవులకు నేడు రాజీనామా చేశారు.  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని చైర్మన్ ఛాంబర్ లో  కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మొన్న జరిగిన  ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు. దీంతో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామాలకు ఆమోదం తెలిపారు.

Exit mobile version