Site icon HashtagU Telugu

Economic Crisis: పాకిస్తాన్ లో పిండి కోసం కొట్టుకుంటున్న జనం.. ఫొటోస్ వైరల్?

Economic Crisis

Economic Crisis

శత్రుదేశం అయిన పాకిస్తాన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రజలకు తిండి కూడా దొరకనే పరిస్థితుల్లో నెలకొంటున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కోసం రంజాన్ ప్యాకేజీ కింద పంజాబ్ ప్రావిన్స్ లోని పేదల కోసం ప్రత్యేకించి ఉచితంగా పిండి పథకం ప్రారంభించారు.

షెషావర్ లోని వందలాది మంది పాకిస్థానీలో పేద ప్రజల కోసం ఉద్దేశించిన గోధుమ పిండిని తీసుకు వెళ్తున్న ట్రక్కు వెనకాలే పరిగెడుతున్నారు. పౌరులు ఉచితంగా గోధుమ పిండిని అందజేస్తుండగా కొందరు ట్రక్కు ఎక్కి కావలసిన ప్యాకెట్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు నెట్టుకోవడం తోసుకోవడం లాంటివి చేస్తున్నారు. పంపిణీ కేంద్రం వద్దకు రాగానే స్థానికులు లారీలో ఉన్న మొత్తం పిండిని దోచుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇంకొందరు ఆందోళనకారులు పిండి కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి 10 కిలోల బ్యాగు చేతికి అందకపోవడంతో రహదారిని దిగ్బందించారు.

 

కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆ 10 కేజీల గోధుమపిండి ప్యాకెట్ కోసం అక్కడి పాకిస్తానీలు ఒకరినొకరు కొట్టుకోవడం తోసుకోవడం లాంటివి చేయడంతో ఆ తోసులాటలో ఇప్పటివరకు నలుగురు వృద్ధులు మరణించారు. ఉచిత పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కాగా మృతుల్లో ఇద్దరు తొక్కిసలాట కారణంగా మరణించగా మిగిలిన ఇద్దరు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి అలసిపోయి చనిపోయారు అని అక్కడి అధికారులు తెలిపారు.

Exit mobile version