Site icon HashtagU Telugu

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూ.35 పెంచుతూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Petrol Diesel Prices

Petrol Diesel Prices

Petrol Diesel Prices: ఇండియా మీద ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే మన దాయాది దేశం పాకిస్థాన్ లో దారున పరిస్థితి నెలకొంది. గతంలో మనం శ్రీలంకలో చూసిన దాని కన్నా దారుణమైన స్థితి ప్రస్తుతం పాకిస్థాన్ లో తాండవిస్తోంది. పాకిస్థాన్ లో తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో గోధుమపిండి కోసం లారీలను చేజ్ చేసిన పాకిస్థానీలను మనం చూశాం.. ఇప్పుడు అలాంటి సీన్లు సర్వసాధారణం అయ్యాయి.

ఇప్పటికే తిండి దొరక్క నరకయాతన అనుభవిస్తున్న పాకిస్థానీల మీద పాక్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.35లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. బంకుల వద్ద బారులు తీరిన జనం కనిపించారు. దీనిపై అక్కడ పత్రిక డాన్ ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

ఇక పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫారసులు మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లు చెప్పారు. తాజాగా దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మీద ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ను అల్లా రక్షిస్తాడు అని అన్నారు. కాగా పాక్ కరెన్సీ విలువ భారీగా తగ్గడం తెలిసిందే. పాక్ రూపాయి మారకం విలువ డాలర్ కు 255రూపాయలుగా ఉంది.

ప్రస్తుతం పాకిస్థాన్ మహా అయితే మూడు వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలను మాత్రమే కలిగి ఉంది. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుండగా.. పాక్ ఐఎమ్ఎఫ్ విడుదల చేసే తదుపరి 100కోట్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్రోగ్రాం మీద ఆశలు పెట్టుకుంది. జనవరి 31 నుండి ఫిబ్రవరి 9 వరకు ఐఎమ్ఎఫ్ బృందం పర్యటన ఉండగా.. ఐఎమ్ఎఫ్ ఎన్ని నిధులను ఇస్తుందనేది దేశంలో అందరికీ ఆసక్తికరంగా మారింది.