Site icon HashtagU Telugu

Pakistani Balloon: జమ్మూలో పాక్ బెలూన్ కలకలం.. దర్యాప్తు చేపట్టిన అధికారులు

Pakistani Balloon

Resizeimagesize (1280 X 720) (6)

Pakistani Balloon: జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో పాకిస్థాన్‌కు చెందిన విమానం ఆకారంలో ఉన్న బెలూన్ (Pakistani Balloon) కనుగొనబడింది. ఆ ప్రాంతంలో అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో పీఐఏ (పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్) లోగోతో కూడిన విమానం ఆకారంలో బెలూన్ (Pakistani Balloon) కనిపించింది. కథువా జిల్లాలోని హీరానగర్‌లో ఒక మిస్టీరియస్ బ్లాక్ అండ్ వైట్ కలర్ బెలూన్ నేలపై పడి ఉంది.

బెలూన్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిమ్లాలోని ఒక ఆపిల్ తోటలో PIA లోగోతో కూడిన విమానం ఆకారంలో ఆకుపచ్చ, తెలుపు రంగుతో కూడిన బెలూన్ కనిపించింది. మే 20న సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది అమృత్‌సర్‌లో పాకిస్తాన్ డ్రోన్‌ను కాల్చివేసినట్లు, అనుమానిత మాదక ద్రవ్యాలతో కూడిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు రోజు పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి నాలుగు పాకిస్తాన్ డ్రోన్‌లను బిఎస్‌ఎఫ్ అడ్డగించింది. వాటిలో మూడింటిని కాల్చివేసింది.

Also Read: Pirarucu : మనిషి కంటే పెద్ద సైజు చేపకు పెనుగండం

ఇటీవల అమృత్‌సర్ సెక్టార్‌లోని రాయ్ గ్రామంలో పొలాల్లో పడి ఉన్న 5.5 కిలోల హెరాయిన్‌ను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ స్మగ్లర్ల తరపున డ్రోన్ల ద్వారా ఈ హెరాయిన్‌ను పంపినట్లు సమాచారం. నిజానికి సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ కాస్తున్నారు. ఇంతలో వారికీ డ్రోన్ శబ్దం వినిపించింది. జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. ఆ తర్వాత డ్రోన్ తిరిగి వచ్చింది. జవాన్లు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా పొలాల్లో పడి ఉన్న 5.5 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంది.