Site icon HashtagU Telugu

Modi: పాకిస్తాన్‌కు మోదీ కావాలి… నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో!

Whatsapp Image 2023 02 23 At 21.45.58

Whatsapp Image 2023 02 23 At 21.45.58

Modi: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం కూరుకుపోయింది. దేశంలోని ప్రజలకు మూడు పూటల అన్నం పెట్టేందుకు కొట్టుమిట్టాడుతోంది. ఆహార ధాన్యాల కొరత, ఆకాశానికి అంటిన నిత్యవసర ధరలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ సందర్భంలోనే ఆ దేశ ప్రజలు భారత్‌ వైపు చూస్తున్నారు. కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్‌ జనానికి భారత్ విలువ తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

తమకి నరేంద్ర మోదీ లాంటి ప్రధాని కావాలంటూ పాకిస్తాన్‌ ప్రజలు కోరుకుంటున్నా రు. ఇటీవల పాకిస్తాన్ జర్నలిస్ట్, స్ట్యూట్యూబర్ సనా అమ్జాద్ ఓ యువకుడిని పాకిస్తాన్ నుంచి బతికి బట్టకట్టాలంటే మనం ఇండియాకు వెళ్లాలని ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించారు. సందర్భంలో ఆతను చెప్పిన సమాధానం ప్రస్తుతం రెండు దేశాల్లో వైరల్‌ అవుతోంది.

తమకు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, జెనజీర్, ముషారఫ్ వద్దని తమకు కేవలం నరేంద్ర మోదీ కావాలంటూ ఆ యువకుడు చెప్పిన మాటలు ఇటు ఇండియాలో, అటు పాక్‌లో వైరల్ అవుతున్నాయి. పాక్ ప్రధాని షెషబాజ్ షరీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మోదీ పాకిస్తాన్ ప్రధాని అయితే పాక్ ప్రజలకు కూడా తక్కువ ధరకే ఆహార పదార్థాలు, కూరగాయలు దొరికేవని అన్నాడు. తాను పాకిస్తాన్‌లో పుట్టకుంటే బాగుండేదని నిరుత్సాహంతో చెప్పడం వీడియోలో చూడవచ్చు.

భారతీయులకు కిలో టొమాటోలు రూ. 20కి, కిలో చికెన్ రూ. 150కి లభిస్తున్నా యని.. మనం మాత్రం రాత్రి పూట పిల్లలకు ఆహారం ఇవ్వ లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంగా ఉంటే మనం కూడా భారతీయ ముస్లింలలాగే ఉండేవాళ్లమని దీంట్లో తేడా
ఏముంటుందని ప్రశ్నించారు. భారతదేశంతో స్నేహం చేస్తే టొమాటోలు, చికెన్ చవకగా లభిస్తాయని పాక్ ప్రభుత్వానికి సూచించాడు. పాక్, భారత్ ఒకే దేశంగా ఉంటే బాగుండేది అని అన్నా డు.