Site icon HashtagU Telugu

Twitter Big Action: పాకిస్థాన్ గవర్నమెంట్ ట్విట్టర్ అకౌంట్ భారత్ లో బ్యాన్…!!

123

123

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ భారత్‌లో నిషేధించినట్లు ప్రకటించింది. ట్విట్టర్ ప్రకారం ఇది భారత ప్రభుత్వ చట్టపరమైన డిమాండ్‌పై జరిగింది. ట్విట్టర్ ఈ చర్యతో, ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం @GovtofPakistan ఈ అకౌంట్ చేసిన ఏ ట్వీట్ కూడా భారత్ లో కనిపించదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది మూడు వారాల క్రితమే జరిగినట్లు తెలుస్తోంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐపై 5 ఏళ్ల నిషేధం విధించడంతో పాటు దాని ట్విట్టర్ ఖాతా కూడా నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం క్రితమే ED, NIA ద్వారా PFI దేశంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా , ఇతర సంస్థలతో PFIకు ఉన్న సంబంధాల గురించి ఆధారాలను సేకరించింది.

Exit mobile version