Site icon HashtagU Telugu

Pakistan Flag: ఇంటి మీద పాక్ జెండా.. గణతంత్ర దినోత్సవం రోజు షాకింగ్ ఘటన!

Whatsapp Image 2023 01 27 At 18.36.54

Whatsapp Image 2023 01 27 At 18.36.54

Pakistan Flag: దేశం మొత్తం ప్రతి సంవత్సరం చిన్నా పెద్ద, జాతి మతం, ఆడ మగా అనే తేడా లేకుండా చేసుకునే రెండు పండుగలు.. స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం. ఈ రెండు రోజులు దేశం మొత్తం మీద మువ్వన్నెల జాతీయ జెండాను ఎంతో గర్వంగా, ప్రేమగా, గౌరవంగా ఎగిరించి.. దేశ భక్తిని చాటుకుంటాం. అయితే ఈ గణతంత్ర దినోత్సవం రోజు కూడా అదే జరిగింది.

ఢిల్లీ నుండి గల్లి వరకు ప్రతి చోట భారత జాతీయ జెండాను ఎంతో గర్వంగా ఎగరేశారు. పేద ధనిక, కులం మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు జాతీయస్పూర్తిని నింపేలా గణతంత్ర దినోవత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇలా దేశం మొత్తం మువ్వన్నెల జాతీయ పతాకం రెపరెపలాడగా.. ఒక్క చోట మాత్రం పాక్ జెండా ఎగరడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

బిహార్ లోని ఓ గ్రామంలో గణతంత్ర దినోత్సవం రోజున ఇంటి మీద పాకిస్థాన్ జాతీయ పతాకం ఎగరడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా… పోలీసులు అక్కడి చేరుకొని పాకిస్థాన్ జాతీయ జెండాను కిందకు దించారు. బిహార్ రాష్ట్రం పూర్తియా జిల్లా సిపాహి తోలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు ఇంటి యజమానిని ప్రశ్నిస్తే.. తనకు ఏమీ తెలియదని వివరించారట. ఒక వ్యక్తి తన ఇంటి మీదకు వెళ్లాడని,
అతడే ఆ జెండాను పెట్టి ఉంటాడని యజమాని వేరే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేశాడు. కాగా దీని పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.