Musharraf : వెంటిలేటర్ పై పాక్ మాజీ అధ్యక్షుడు…మరణించాడంటూ తప్పుడు ప్రచారం..!!

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ప్రస్తుతం ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Musharaf

Musharaf

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ప్రస్తుతం ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ గా వ్యవహరించిన ముషారఫ్ 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు.

1943 ఆగస్టు 11న ముషారఫ్ ఢిల్లీ జన్మించారు. దేశ విభజన సమయంలో ముషారఫ్ కుటుంబం పాకిస్తాన్ కు వలస వెళ్లింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యంలో చేరిన ముషారఫ్ సుదీర్ఘకాలం సేవలందించారు. 1998 నుంచి 2007 వరకు పాక్ ఆర్మీ చీఫ్ గా వ్యవహారించారు. అప్పటి నవాజ్ షరీఫ్ సర్కార్ ను కూలదోసి అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు ముషారఫ్ .

అయితే శుక్రవారం మధ్యాహ్నం ముషారఫ్ మరణించారంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన వక్త న్యూస్ అనే మీడియా ముషారఫ్ మరణించారంటూ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ట్వీట్ చేసింది. అయితే ఈ వార్తలు అవాస్తవమంటూ ఇతర మీడియా సంస్థలు వెల్లడించడంతో…వక్త న్యూస్ ఆ ట్వీట్ ను తొలగించింది.

  Last Updated: 10 Jun 2022, 07:20 PM IST