Site icon HashtagU Telugu

Pakistan:రాజాసింగ్ పై చ‌ర్య‌ల‌కు పాక్ డిమాండ్‌

Raja Singh

Raja Singh

తెలంగాణ బీజేపీ రాజాసింగ్ వ్యాఖ్య‌లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల‌కు సైతం పాకాయి. అయితే ఆయ‌న వ్యాఖ‌ల‌ను కొంద‌రు స‌మ‌ర్థిస్తే, మ‌రికొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మైనార్టీ నేత‌లు డిమాండ్ చేస్తుండ‌గా, ఇండియా ప్ర‌త్య‌ర్థి దేశ‌మైన పాకిస్థాన్ సైతం రాజాసింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను పాక్ విదేశాంగ శాఖ ఖండించింది. అంతేకాదు.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భారత ప్ర‌భుత్వాన్ని కోరింది. ప‌దే ప‌దే అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించింది పాక్ ప్ర‌భుత్వం.